1. పేద మరియు మద్యతరగతి ఇల్లల్లో మద్యపానం వల్ల నష్టాలు (effects of alcoholism or drinking on poor and middle class families):

ఈ అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిన సత్యమిది. కుటుంబ పెద్ద మరియు సంపాదించే ఏకైక వ్యక్తి మాద్యానికి బానిసైతే ఆ ఇంట్లో ఉండే బార్యాపిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఎటువంటి సంబందంలేని బయట వ్యక్తిలు అలా వారి కుటుంబాలు  (గొడవలు, కొట్లాటలు, ప్రమాదాల వల్ల) ఇలా ఎంతో మంది జీవితాలు తలకిందులై, కుటుంబాలకు కుటుంబాలు సర్వనాసనం అవుతున్నాయి. కొంతమంది దొంగలుగా, నేరస్తులుగా, చిన్నారులు, ముసలివారు అడుక్కునేవారిగా మారుతున్నారు. మొదట కుటుంబం, తరువాత చుట్టు పక్కలవారు ఇలా ఎంతోమంది ఈ మహమ్మారికి బలైపోతున్నారు. కొన్ని సంగటనలు చూస్తే, మనస్సు చివుక్కుమనక మానదు. ఇలాంటి కధలు ఒక చోటచేర్చి, వాటిని ప్రభుత్వ ద్రుష్ఠికి తీసుకువెల్లడమే ఈ పేజి ఉద్ద్యేశ్యం. దయచేసి, మీ చూసిన, మీ దుష్ఠికి వచ్చిన ఇలాంటి సంఘటనలు మా మెయిలుకు పంపండి. వాటిని, ఈ పేజిలో ప్రచురిస్తాము.

ఇక నుండి, మద్యపానం వల్ల నాసనం అయిపోయిన బతుకుల గురించి, వాటి మీద ప్రభుత్వం యొక్క స్పందన గురించి ఇందులో ప్రచురిస్తాం.

1000. 18.05.24-తల్లాడ, ఖమ్మం జిల్లా, తెలంగాణ

ఇక్కడ తప్పు ఎవరిది? ఆ పేద ఇంట్లో పుట్టిన ఆ పసివాళ్ళాదా? ఆదాయం కోసం తప్పని తెలిసినా మద్యం, సిగరెట్, పాన్ విక్రయించే అనుమతి ఇచ్చిన ప్రభుత్వానిదా?
ఈ పాపానికి కారనమైన ప్రభుత్వ విదానాలను కొనసాగించే ప్రతి ఒక్కరికి ఈ పసిపిల్లల ఉసురు తగులుతుంది. మనం బతకటమే కాదు, పేదవాళ్ళను కూడా బతకనిద్దాం.

ఈ కేసులో ప్రభుత్వం చేసిన న్యాయం మీకు తెలిస్తే, మాకు పంపండి (placeforhumanity1947@gmail.com). ఇక్కడ ప్రచురిస్తాం.

Leave a comment