ఈ అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిన సత్యమిది. కుటుంబ పెద్ద మరియు సంపాదించే ఏకైక వ్యక్తి మాద్యానికి బానిసైతే ఆ ఇంట్లో ఉండే బార్యాపిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఎటువంటి సంబందంలేని బయట వ్యక్తిలు అలా వారి కుటుంబాలు (గొడవలు, కొట్లాటలు, ప్రమాదాల వల్ల) ఇలా ఎంతో మంది జీవితాలు తలకిందులై, కుటుంబాలకు కుటుంబాలు సర్వనాసనం అవుతున్నాయి. కొంతమంది దొంగలుగా, నేరస్తులుగా, చిన్నారులు, ముసలివారు అడుక్కునేవారిగా మారుతున్నారు. మొదట కుటుంబం, తరువాత చుట్టు పక్కలవారు ఇలా ఎంతోమంది ఈ మహమ్మారికి బలైపోతున్నారు. కొన్ని సంగటనలు చూస్తే, మనస్సు చివుక్కుమనక మానదు. ఇలాంటి కధలు ఒక చోటచేర్చి, వాటిని ప్రభుత్వ ద్రుష్ఠికి తీసుకువెల్లడమే ఈ పేజి ఉద్ద్యేశ్యం. దయచేసి, మీ చూసిన, మీ దుష్ఠికి వచ్చిన ఇలాంటి సంఘటనలు మా మెయిలుకు పంపండి. వాటిని, ఈ పేజిలో ప్రచురిస్తాము.
ఇక నుండి, మద్యపానం వల్ల నాసనం అయిపోయిన బతుకుల గురించి, వాటి మీద ప్రభుత్వం యొక్క స్పందన గురించి ఇందులో ప్రచురిస్తాం.
ఇక్కడ తప్పు ఎవరిది? ఆ పేద ఇంట్లో పుట్టిన ఆ పసివాళ్ళాదా? ఆదాయం కోసం తప్పని తెలిసినా మద్యం, సిగరెట్, పాన్ విక్రయించే అనుమతి ఇచ్చిన ప్రభుత్వానిదా?
ఈ పాపానికి కారనమైన ప్రభుత్వ విదానాలను కొనసాగించే ప్రతి ఒక్కరికి ఈ పసిపిల్లల ఉసురు తగులుతుంది. మనం బతకటమే కాదు, పేదవాళ్ళను కూడా బతకనిద్దాం.
ఈ కేసులో ప్రభుత్వం చేసిన న్యాయం మీకు తెలిస్తే, మాకు పంపండి (placeforhumanity1947@gmail.com). ఇక్కడ ప్రచురిస్తాం.
పసివాల్ల జీవితాలు ఇలా నాసనం అవుతుంటే, ఆంధ్ర ప్రభుత్వ ఆదాయం ఇలా ఉంది (ఆధారం: The New Indian Express 30.09.2023)
2019-20: 17,473కోట్లు
2020-21: 17,890కోట్లు
2021-22: 21,432కోట్లు
2022-23: 23,785కోట్లు
2023-24: సమాచారం మా వద్ద లేదు
ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం. ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ బాద్యత. అందుకే ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులకు మరియు ప్రతిపక్ష ప్రతినిదులుకు నెలనెలా జీతం చెల్లించెది. ప్రభుత్వానికి నిజంగా పేద ప్రజల క్షేమమే ముఖ్యం అయితే,
1) సంపుర్ణ మద్యపానం దిశగా చర్యలు తీసుకోవాలి.
2) ఈ మహమ్మారి కారణంగా ఎన్ని పేద కుటుంబాలు నష్టపోయాయొ ఒక సంపూర్న సర్వే నిర్వహించాలి. ఆ సర్వే వివరాలతో ఒక పుస్తకం ప్రచురించి ఉచితంగా అందుబాటులోకి తేవాలి. ఒక శాఖను ఏర్పాటు చేసి మద్యపాన అలవాటు మానిపించే ప్రయత్నం చేయాలి.
భారతదేశంలో బీహార్, గుజరాత్, మిజోరాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు మద్యాన్ని నిషేధించాయి (ఆధారం: NEWS18 Telugu 06.10.24) ఆంధ్రప్రదేశ్ లో నిషేదం విదించే నాయకుడు వున్నడా?
ఇది జరుగుతుందో? లేదో? ఏ ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నం చేస్తుందో, ఏ రాజకీయ నాయకుడు నిజమైన నాయకుడై గొప్ప మనసుతో ఈ పుణ్యకార్యం చేసి మహాత్ముడు అవుతాడో చూద్దాం…
నిత్యం మన చుట్టూ ఈ మహమ్మారి విలయ తాండవం కారణంగా జరుగుతున్న బతుకుల నాశనం యజ్ఞంలో సమిదలైన చాలా చాలా కొద్దిమంది అబాగ్యులు, నిస్సహాయుల వివరాలు దిగువ ఇవ్వబడ్డాయి…
I was looking through some of your articles on this site and I believe this internet site
is really informative! Continue putting up.Blog money