2. ముష్టి పిల్లలు (child beggers or begging children)

క్షమించండి. ఈ పదం వింటేనే ఏదోలా ఉందే, అలాంటిది ఆ ముక్కుపచ్చలారని పసివాళ్ళను చూస్తే మనస్సు చివుక్కుమనదా?. మన పిల్లలని కనీసం అలా ఊహించగలమా? ముష్టి ఎత్తుకునే తల్లిదండ్రులను ఆ వ్రుత్తి నుండి బయట పడేయటానికి ప్రభుత్వానికి మంచి ప్రణాళిక, అందుకు తగ్గట్టుగా పనిచేసే ప్రభుత్వ అధికారులు, డబ్బు, ప్రజల సహకారం ఇలా చాలా అంశాలు కలసిరావాలి. కాని, వారి పిల్లలను ఈ శిక్షనుండి తప్పించటానికి మనలాంటి సోషల్ మీడియా వాడే వాళ్ళు మంచి మనస్సుతో ముందుకు వస్తే చాలు కదా!. అందుకనే పసిపిల్లలను ఈ నరకం నుండి బయటపడేసే ప్రయత్నం కోసం ఓ చిన్న పయత్నమే ఈ వెబ్ సైట్.

మనం ఏం చేయాలి?

ఈ పసిపిల్లలకు సంబందించిన చట్టాలు, వాటి అమలు తీరు, వాటిని ఎలా మెరుగుపరచవచ్చు, వారి బాల్యం ఎంత నరకమో, చిన్న చిన్న సహాయాలతో వారిని ఏలా రక్షించవచ్చో, ఇలాంటి విషయాలు ప్రభుత్వం మరియు అదికారులకు తెలిసేలా చేయటమే మనం చేయాల్సింది. కాబట్టి, పైన చెప్పిన వివరాలు ఇక్కడ పొందుపరుద్దాం. మీకు తెలిసిన విషయాలు, వివరాలు, పిల్లలకు ఉచితంగా వైద్యం అందించే దాతల మరియు హాస్పిటల్ వివరాలు, వారికి మేలు చేసిన మనసున్న మంచి వాళ్ళ వివరాలు ఇలా ఈ విషయానికి సంబందించిన ఏవివరమైనా “placeforhumanity1947@gmail.com” మెయిలుకు పంపండి. ఈ వివరాలు ఈ వెబ్ సైట్ లో ప్రచురిస్తాం.

గమనిక: ఈ వెబ్ సైట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు పంపవచ్చు. దన్యవాదాలు!!!

1. AP ప్రభుత్వ ప్రణాళిక (November 2020) కొరకు ఇక్కడ CLICK చేయండి. ఈ ప్రణాళిక అమలు అయిందా లేదా? మీకు ఏమైనా తెలిస్తే మాకు మెయిల్ పంపండి. ఇక్కడ ప్రచురిస్తాం.

2. తెలంగాణాలో begging మీద ఒక Ph.D Scholar చేసిన case study కొరకు ఇక్కడ CLICK చేయండి

3. Child Begging: Challenges And Issues, Why Children Are Forced, Legal Framework, How To Help Child Beggars – పిల్లల భిక్షాటన: సవాళ్లు మరియు సమస్యలు, పిల్లలను ఎందుకు బలవంతం చేస్తారు, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్, పిల్లల బిచ్చగాళ్లకు ఎలా సహాయం చేయాలి? (వెబ్‌సైట్ నుండి సేకరణ (24.02.21))

4. Laws in states against child begging or child beggers in India – భారతదేశంలో పిల్లల భిక్షాటనకు వ్యతిరేకంగా రాష్ట్రాలలో చట్టాలు (వెబ్‌సైట్ 24.02.21 నుండి సేకరణ)

 

Leave a comment